పెళ్లిలో బిర్యానీ కోసం లొల్లి.. 12 మందికి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లిలో బిర్యానీ కోసం లొల్లి.. 12 మందికి గాయాలు

May 18, 2019

పెళ్లి భోజనాల దగ్గర జరిగిన చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ గొడవలో 12 మందికి గాయాలపై ఆస్పత్రి పాలయ్యారు. కలకలం రేపుతున్న ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తణుకులో చోటు చేసుకుంది.

fighting for biryani at marriage function At andhra pradesh tanuku.. 12 12 people injured
పాతూరు గ్రామానికి చెందిన వధువు తరుపు బృందం, పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన వరుడి ఇంటి వద్ద వివాహ వేడుకకు వచ్చారు. పెళ్ళి తంతు ముగిసాకా.. భోజనాలు చేస్తున్న సమయంలో బిర్యానీ గురించి మాటామాటా పెరిగి వధువు, వరుడి వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ఈ దాడిలో వరుడి తరుఫున ఆరుగురికి, వధువు తరఫున ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్ళి మండపం వద్ద గొడవ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిక ఘటనా స్థలానికి గాయాలపాలైన వారిని తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.