ర్యాష్ డ్రైవింగ్ వల్ల మనుషుల ప్రాణాలు తీసేవాళ్లపై కేసులు పెట్టి, శిక్షలు వేయడం మనకు తెలిసిందే. హిట్ అండ్ రన్ కేసుల్లో కొన్నిసార్లు మూగజీవాలు కూడా చచ్చిపోతుంటాయి. ఎప్పుడూ ఇలాంటివేనా అనుకుందేమో ఏమో ఓ కుక్క వెరైటీ పీట్ చేసింది. వేగంగా దూసుకొచ్చి మనిషిని ఢీకొట్టి పారిపోయింది. అనూహ్యమైన ఈ హిట్ అండ్ రన్‌తో అతడు దబ్బున కింద పడి నడుం విరగ్గొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇలాంటి కేసుల్లో మనుషులను శిక్షిస్తున్నట్లే ఈ కుక్కపైనా కేసు పెట్టి శిక్షించాలని నెటిజన్లు సరదాగా అంటున్నారు. అయితే, అది ఎందుకు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చిందో తెలుసుకుని ఆ కోణంలో దర్యాప్తు జరిపించాలని, దానికి ఎదురుగా రావడం అతని తప్పేనని మరికొందరు కుక్క తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నారు.