ఇండస్ట్రీ లో వివక్షతను ఎదుర్కున్న సోన్ సూద్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇండస్ట్రీ లో వివక్షతను ఎదుర్కున్న సోన్ సూద్..

August 2, 2017

.

సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన వారు చాలా మందే ఉన్నారు . అలాటి వారిలో సోన్ సూద్ ఒక్కరు. కెరీర్ మెదట్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికి , తన టాలెంట్ తో వాటిన్నింటినీ అధిగమించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సోన్ సూద్. నిర్మాతగా మారి కొత్త వాళ్లకు అవకాశలు కల్పిస్తున్నాడు. అయితే ఇండస్ట్రీలో ఎలాంటి నేపథ్యం లేకుండా సినిమాలోకి రావడం వలన చాలా వివక్షతను ఎదురుకున్నానని చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా సమస్యలు ఎదుర్కొన్నా . సినీ కుంటుంబానికి చెందిన వాడిని కాదు కాబట్టి నాతో ఎవరు మాట్లాడేవారు కాదని. కనీసం నేను ఎలా నటిస్తున్నానో కూడా చూసేందుకు ఇష్టపడేవారు కాదని. అలాంటి సమయంలో మంచి గుర్తింపు వచ్చే పాత్రలు రావడం లేదని బాధపడేవాడిని. సరైన అవకాశం కోసం ఎదురుచూడడం చాలా కష్టంగా ఉండేది. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి. వాటన్నింటిని ఎవరికి వారే సొంతగా అధిగమించాలి అని నేను నమ్మేవాడిని. అందుకే కష్టాలను నేను అధిగమించాను. నాకే కాదు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారికి ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి అంటున్నారు సోన్ సూద్.