‘బాలాపూర్’ రికార్డును బ్రేక్ చేసిన ఫిల్మ్‌నగర్ లడ్డు  - MicTv.in - Telugu News
mictv telugu

‘బాలాపూర్’ రికార్డును బ్రేక్ చేసిన ఫిల్మ్‌నగర్ లడ్డు 

September 12, 2019

Film nagar vinayaka.

హైదరాబాద్‌లో వినాయక లడ్డుల వేలం జోరుగా సాగింది. ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ లడ్డు రికార్డును మరో లడ్డు బ్రేక్ చేసింది. ఫిల్మ్నగర్‌లోని వినాయక నగర్‌¡లో ఏర్పాటు చేసిన గణపతికి నైవేద్యంగా పెట్టిన లడ్డు ఏకంగా రూ. 17.75 లక్షలు పలికింది. బీజేపీ నేత గోవర్ధన్ దీన్ని కైవసం చేసుకున్నారు. నగరంలో ఒక లడ్డుకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. గత ఏడాది వినాయక నగర్ లడ్డు రూ. 15.1 లక్షలు పలికింది. కాగా, గాజా వేలంలో బాలాపూర్ లడ్డు రూ.17.60 లక్షలు పలికింది. కొలను రామిరెడ్డి అనే వ్యక్తి దీన్ని దక్కించుకున్నారు.