సినిమా సెట్ ధ్వంసం.. ముఖ్యమంత్రి ఆగ్రహం  - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా సెట్ ధ్వంసం.. ముఖ్యమంత్రి ఆగ్రహం 

May 26, 2020

ఓ సినిమా నిర్మాణంలో భాగంగా వేసిన చర్చి సెట్టింగును ఆందోళనకారులు ధ్వంసం చేశారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా అలువ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఆలయం వద్ద వేసిన సెట్టింగును ఆదివారం రాత్రి అంతర్రాష్ట హిందూ పరిషత్ కార్యకర్తలు కూల్చేశారని పోలీసులు చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు జరిపించి దుండగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇది తమ రాష్ట్రంలో జరిగాల్సిన సంఘటన కాదని అన్నారు. 

‘మిన్నల్ మురళి’ అనే చిత్రం షూటింగ్ కోసం ఈ సెట్ వేశామని, అధికారుల నుంచి, గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకున్నామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. మతవిద్వేషంతోనే విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. సెట్స్ ను కూల్చేస్తున్న వీడియోను హిందూ అతివాద సంఘాలు సోషల్ మీడియాలో పెట్టడంతో మరింత కలకలం రేగింది. దాడిని బీజేపీ, ఆరెస్సెస్ కూడా ఖండించాయి.