ఆగిపోనున్న సినిమా షూటింగులు.. సమ్మెకు దిగిన సినీ కార్మికుల - MicTv.in - Telugu News
mictv telugu

ఆగిపోనున్న సినిమా షూటింగులు.. సమ్మెకు దిగిన సినీ కార్మికుల

June 21, 2022

తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లు నిలిచిపోనున్నాయి. జీతాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగుతుండటంతో బుధవారం నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ప్రతీ మూడేళ్లకు జీతాలు పెంచాల్సిన నిర్వాహకులు, నాలుగేళ్లు గడిచినా పెంచకపోవడంతో వారంతా నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం.. నగర శివారు వెంకటగిరిలోని ఫిలిం ఫెడరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించారు.

జీతాలు పెంచేవరకు సినీ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ వారు షూటింగ్‌కు రాకూడదని ఫెడరేషన్ మీద ఒత్తిడి చేయడానికీ 24 యూనియన్ సభ్యులు ఈ బుధవారం ఉదయం ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడి చేయన్నట్టు ప్రకటించారు. వేతానాలు పెంచే వరకు 24 క్రాఫ్ట్స్ ఎవరు షూటింగ్‌లో పాల్గొనబోమని ఈ సందర్భంగా ప్రకటించారు. మరి ఈ అంశం మీద ఫిల్మ్ ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కార్మికుల వేతన సమస్యను పరిష్కరించేందుకు ఎవరు ముందుకు వస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఈ అంశం చిరంజీవి దృష్టికి వెళ్తే పరిష్కారం వెంటనే లభిస్తుందని కార్మికులు భావిస్తున్నారని తెలుస్తోంది.