రంగీన్ ఫిలింఫేర్ - MicTv.in - Telugu News
mictv telugu

రంగీన్ ఫిలింఫేర్

June 19, 2017

64 వ ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్ అదిరిపోయింది. హీరోయిన్లందరు రెడ్ కార్పెట్ మీదికచ్చిన కొర్రమీనులు లెక్క రంగురంగుల గౌన్లతోని రంగీన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. నేనంటే నేనన్నట్టు హీరోయిన్లందరూ రకరకాల డిజైన్ల గౌన్లు వేస్కొచ్చి ఫంక్షన్ ను కలర్ ఫుల్ ఈవెంటుగా మార్చేశారు.

సౌత్ కు చెందిన ప్రముఖ ఆక్టర్లందరు పాల్గొని హల్ చల్ చేసారు. ఏ ఆర్ రెహమాన్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, జ్యోతిక, సూర్య, కార్తి, మాధవన్, రాహుల్ రవీంద్రన్, కృష్ణ, విజయ నిర్మల, కేథరిన్, జూనియర్ ఎన్టఆర్, అల్లు అర్జున్, ఖుష్బూ, రాశీ ఖన్నా, ప్రకాష్ రాజ్, అల్లు శిరీష్, విజయ దేవరకొండ, త్రిష తదితరులు పాల్గొని ఈవెంటును కలర్ ఫుల్ ఈవెంటును చేసారు. అయితే ఈసారి ఉత్తమంగా నిలిచిందెవరంటే…

64 వ ఫిలింఫేర్ అవార్డుల విజేతలు :

ఉత్తమ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ( నాన్నకు ప్రేమతో )

ఉత్తమ నటి సమంత ( అఆ )

ఉత్తమ దర్శకుడు వంశీ పైడిపల్లి ( ఊపిరి )

ఉత్తమ సహాయ నటుడు జగపతి బాబు ( నాన్నకు ప్రేమతో )

ఉత్తమ సహాయ నటి నందితా శ్వేత ( ఎక్కడికి పోతావు చిన్నవాడ )

ఉత్తమ నేపథ్య గాయకుడు కార్తిక్ ( అఆ, ‘ ఎల్లిపోకే శ్యామలా.. ’ )

ఉత్తమ గాయని చిత్ర ( నేను శైలజ, ‘ ఈ ప్రేమకి .. ’)

ఉత్తమ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి ( జనతా గ్యారేజ్ )

ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ ( నాన్నకు ప్రేమతో )

ఫిల్మ్ ఫేర్ క్రిటిక్ అవార్డ్ అల్లు అర్జున్ ( సరైనోడు )

ఫిల్మ్ ఫేర్ క్రిటిక్ అవార్డ్ రీతూవర్మ ( పెళ్ళి చూపులు )