అది దళితులకు చీకటి యుగం.. పా రజింత్‌పై కేసు - MicTv.in - Telugu News
mictv telugu

అది దళితులకు చీకటి యుగం.. పా రజింత్‌పై కేసు

June 12, 2019

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘కాలా’, ‘కబాలి’ వంటి హిట్ చిత్రాలు తీసిన కోలీవుడ్ దర్శకుడు పా రంజిత్ చిక్కుల్లో పడ్డారు. చాళుక్య రాజు రాజరాజ చోళుడి పాలనపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వాటిపై తంజావూరు జిల్లా తిరుపనందల్ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. రంజిత్ ప్రజల మధ్య కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Filmmaker Pa Ranjith booked for alleged remarks against Chola emperor

పా రంజిత్ ఈ నెల 5న ఉమర్ ఫారూఖ్ అనే సంఘసేవకుడి సంస్మరణ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. చోళరాజుల పాలనలో దళితులను దారుణంగా అణగదొక్కారని, దేవదాసి వ్యవస్థను ప్రోత్సహించి నిమ్నకులాలను నీచంగా చూశారని ఆరోపించారు. ‘రాజారాజ చోళన్ పాలన దళితులకు చీకటి యుగం. తంజావూర్ డెల్టాలోని దళితుల భూములను లాక్కున్నారు. కుల అణచివేత చోళుల కాలంలోనే మొదలైంది. 400 మంది దళిత స్త్రీలు దేవదాసీలుగా, సెక్స్ వర్కర్లుగా మారారు. దేవదాసి వ్యవస్థ ఆ రాజుల కాలంలోనే మొదలైంది.. ’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు విద్వేషం కలిగించేలా ఉన్నాయంటూ తంజావూరుకు చెందిన బాల అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.