These are the films releasing in theaters this week
mictv telugu

ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్న చిత్రాలివే

November 15, 2022

These are the films releasing in theaters this week

ప్రతీ వారం థియేటర్లలో కొత్త సినిమాలు రిలీజవడం మనకు తెలిసిందే. అయితే ఈ వారం విడుదలయ్యే చిత్రాలన్నీ చిన్నవే. కొన్ని టైటిల్‌‌తోనే ఆకట్టుకుంటే మరికొన్ని కంటెంట్ పరంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.

ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది మసూద అనే సినిమా గురించి. తిరువీర్, కావ్య జంటగా వస్తున్న ఈ సినిమా హారర్ డ్రామా నేపథ్యంతో రూపొందింది. నవంబర్ 18న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకోగా, కంటెంట్ ప్రధానంగా ఉండనుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇక బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్, గెహనా సిప్పీ జంటగా నటించిన గాలోడు సినిమా కూడా నవంబర్ 18 న రిలీజ్ కాబోతోంది. పక్కా ఎంటర్ టైనర్‌‌గా వస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ఇక టైటిల్‌‌తో ఆకట్టుకున్న మరో సినిమా అలిపిరికి అల్లంత దూరంలో. రావణ్ నిట్టూరు హీరోగా ఉన్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ నందినీ రెడ్డి వద్ద అసిస్టెంట్‌‌గా పని చేసిన జె ఆనంద్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కూడా నవంబర్ 18న థియేటర్లో పలకరించనుంది. ఇక బాలీవుడ్ పరంగా చూస్తే దక్షిణాది ప్రేక్షకులు హిట్ చేసిన దృశ్యం 2 సినిమా నవంబర్ 18న థియేటర్లో సందడి చేయనుంది. అజయ్ దేవగణ్, శ్రియా కాంబినేషన్‌‌లో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇక జెనీలియా ఆమె భర్త రితేశ్ దేశ్ ముఖ్ జంటగా వస్తున్న మిస్టర్ మమ్నీ చిత్రం కామెడీ ప్రధానంగా ఉండనుంది. ఈ సినిమా కూడా నవంబర్ 18న వస్తోంది. మరి ఈ చిత్రాలలో ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో, ఏ సినిమా హిట్టవుతుందో వేచి చూడాలి.