Home > Featured > సచివాలయం కేటగిరీ-1 ఫైనల్ కీ.. అందరికీ మరో 2 మార్కులు.. 

సచివాలయం కేటగిరీ-1 ఫైనల్ కీ.. అందరికీ మరో 2 మార్కులు.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థలో పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్‌ 1న నిర్వహించిన కేటగిరీ -1 పరీక్ష తుది కీని విడుదల చేసింది. పరీక్షపై అభ్యంతరాలను నిన్నటి వరకు అభ్యంతరాలు స్వీకరించి ఈ రోజు తుది కీని విడుదల చేశారు. ప్రశ్నలు, జవాబులకు సంబంధించి రెండు తప్పులను గుర్తించారు. ఒక ప్రశ్నకు సమాధానం లేకపోవడం, మరో ప్రశ్నలో అనువాదం సరిగ్గా లేకపోవంతో అందరికీ రెండు మార్కులు ఎక్కువ ఇవ్వనున్నారు. ఈ రెండు ప్రశ్నలకు అభ్యర్థులు జవాబులు ఇచ్చినా, ఇవ్వకపోయినా అందరికీ రెండు మార్కులు అదనంగా వస్తాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో నియామకాల కోసం గత ఆదివారం నుంచి మొదలైన పరీక్షలు రేపు(ఆదివారం) ముగియనున్నాయి.

AP GRAM SACHIVALAYAM.

ఫైనల్ కీ కోసం ఈ కింది లింకును క్లిక్ చేయండి

http://gramasachivalayam.ap.gov.in/finalkeys.html

Updated : 7 Sep 2019 8:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top