రేపే తెలంగాణ ఓటర్ల తుది జాబితా… - MicTv.in - Telugu News
mictv telugu

రేపే తెలంగాణ ఓటర్ల తుది జాబితా…

October 11, 2018

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఓటర్ల తుది జాబితా ఎప్పుడని కొంతకాలంగా చర్చ జరుగుతోంది. అడ్డంకులన్నీ తొలగించుకుని, సవరణలు సరిచేసుకుని హైకోర్టు అనుమతితో కేంద్ర ఎన్నికల సంఘం రేపు తెలంగాణ ఓటర్ల తుది జాబితా వెలువడనుంది.Final list of Telangana votersఈనెల 5న జారీ చేసిన నిలుపుదల ఉత్తర్వులను హైకోర్టు ఎత్తివేసింది. ఓటర్ల జాబితాలోని తప్పుల సవరణకు సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళిక వివరాల్ని ప్రమాణపత్రం రూపంలో సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌తో కూడిన ధర్మాసనం ఈసీని ఆదేశించింది.  బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాను ప్రచురించాలని స్పష్టం చేసింది. జాబితాలో మార్పులు చేర్పులు, తొలగింపునకు అనుసరిస్తున్న మార్గదర్శకాలు, విధానాలు, షెడ్యూల్‌ వివరాల్ని సమర్పించాలని ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్‌ జోలికి తాము వెళ్లబోమని కూడా స్పష్టం చేసింది.

కోర్టు తీర్పు అనంతరం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. 19వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు వుంటుంది. దానికి పది రోజులు ముందు వరకు ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. నామినేషన్ల చివరి గడువు వరకు చిరునామా, ఇతర మార్పుల కోసం తీసుకుంటామని చెప్పారు.

ఈ నెల 17లోగా ఎన్నికల సిబ్బంది బదిలీ ఉత్తర్వులను జారీ చేస్తామన్నారు. కొత్త ఓటర్లు, చిరునామా మార్పులు, ప్రవాసాంధ్రుల విజ్ఞప్తులు కలిపి మొత్తం 33,14,006 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.