Finalized by YCP Rajya Sabha members
mictv telugu

ఇద్దరు తెలంగాణ వారికి జగన్ రాజ్యసభ సీట్లు

May 17, 2022

Finalized by YCP Rajya Sabha members

తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రముఖులను ఏపీ సీఎం, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపనున్నారు. తెలంగాణకు చెందిన బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, సినీ నిర్మాత నిరంజన్ రెడ్డిలతోపాటు విజయసాయి రెడ్డి, బీద మస్తాన్ రావులను ఆయన రాజ్యసభకు పంపనున్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలు వెల్లడించారు.

విజయసాయి రెడ్డి ఇదివరకే రాజ్యసభ సభ్యుడు కాదా, నిరంజన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ నిర్మాత. ఆయనతోపాటు నెల్లూరుకు చెందిన మరో బీసీ నేత బీద మస్తాన్ రావు రాజ్యసభకు వెళ్లనుండడం ఇదే తొలిసారి. నలుగురితో రెండు సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి, మరో రెండు సీట్లు బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు. అసెంబ్లీలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో నలుగురి ఎన్నిక ఏ మాత్రం పోటీ లేకుండా జరగనుంది.