ఇంద్ర ధనుస్సుకు ఏడు రంగులు- నోట్ల రద్దు కు ఎనిమిది నెలలు... - MicTv.in - Telugu News
mictv telugu

ఇంద్ర ధనుస్సుకు ఏడు రంగులు- నోట్ల రద్దు కు ఎనిమిది నెలలు…

September 3, 2017

నోట్ల రద్దు జరిగి ఇప్పటికి ఏడు నెలలయ్యింది. భారత దేశ ఆర్ధిక రంగం పై అది వేసిన తాత్కాలిక ప్రభావాలు, ఆటుపోట్లు దీర్ఘకాలిక అంచనాలు, నెరవేరిన, నెరవేరని రాజకీయ, సామాజిక లక్ష్యలు ఇవన్ని ఒక ఎత్తు ఐతే అవి ప్రకటించిన లక్ష్యలు –నల్ల ధనం వెలికితీత, బినామీల భరతం, ఉగ్రవాదుల ఆర్టిక మూలాలను దెబ్బ కొట్టడం, అవినీతి రహిత సమాజం లాంటివి ఎంతవరకు నెరవేరాయనేది మొదటి ప్రశ్న. తర్వాత ప్రకటించిన కొసరు లక్ష్యలైన క్యాష్ లెస్ ఎకానమీ, డిజిటల్ ఇండియా లాంటివైన నేవేరాయా అనేది రెండో ప్రశ్న. తక్షణ ఇబ్బందుల లిస్టు చేంతాడంత  ఉంది సరే, దీర్ఘ కాలిక లక్ష్యాలు ఏ కాల పరిమితి లో పని చేయడం మొదలు పెడతాయి లాంటి ప్రశ్నలు ఇంకొన్ని.

నోట్ల రద్దును ప్రధానమంత్రి స్వయంగా ప్రకటించినప్పుడు అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అవినీతి ఫై సర్జికల్ స్ట్రైక్, నరేంద్ర మోడీ సాహసోపేత నిర్ణయం. కొత్త ప్రధానమంత్రి నేతృత్వం లో క్లీన్ ఇండియా ఉదయించబోతోంది పరశు రాముడు వీరుడు శూరుడు లాంటి పతాక స్థాయి వార్తలతో మోడీ మేనియా విశ్వా వ్యప్తమైనట్టు  వార్త పత్రికలు హోరెత్తించాయి. నోట్లరద్దు  తర్వాత కొత్త నోట్లు చలామణి లోకి వచ్చేoత వరకు జనం పడిన ఇక్కట్లు, పాత నోట్లు మర్చుకునేoదుకు లేదా బ్యాంకు లో వేసేందుకు పడిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఎటిఎం ముందు క్యూ లలో నిలబడి డబ్బులు దొరకక, గుoడే పగిలి,  సొమ్మసిల్లి పడిపోయి,దిగులుతోనో అనారోగ్యం తోనో (హాస్పిటల్ లో డబ్బులు (కొత్తవి) కట్టలేక) చనిపోయిన వారి సంఖ్య దాదాపు రెండు వందలు. ఈ లెక్క చెప్పిన వారి విస్వతనీయత కాసేపు అటుంచితే సందట్లో సడేమియా టైపులో నోట్ల మార్పిడి చేసిపెట్టేందుకు పుట్టుకాచ్చిన కొత్త దళారుల సంఖ్య తక్కువేం కాదు. ఇందులో కొంత మంది బ్యాంకు మేనేజర్ ల పాత్ర కూడా లోపాయకారిగా ఉందనేది స్పష్టం.

నల్ల ధనం వెలికితీత పేరుతొ జరిగిన రైడ్లు కొద్దో గొప్పో నల్ల డబ్బ్బు లేదా దొంగ డబ్బును వెలికి తీయగలిగాయి. అవి ప్రభుత్వ లెక్కల  ప్రకారం సుమారు 6500  కోట్లు. సుమారు 15 లక్షల కోట్ల లో ఇది ఎంత శాతం అనేది పక్కన పెడితే ఇది ఒక సానుకూల అంశం.

ఈ సమయంలోనే పన్ను వసూళ్ళు 15 శాతం  మేరకు పెరిగినట్టు ఇంకో అంచనా. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద నల్ల ధనాన్ని స్వచ్చదంగా దఖలు పరిచే వెసులుబాటు కింద ఒక 4000 కోట్లు తిరిగి వస్తాయని లేక వచ్చాయని ఇంకొక అంచనా.

అసలు కరెన్సీ గా చలామణి లో అప్పటికి ఉన్న నోట్ల సంఖ్య 15.44 లక్షల కోట్ల రూపాయలు. అందులోనుంచి 15.28 లక్షల కోట్లు తిరిగి వాచ్చినట్టు, 0.౦౦౦7 శాతం అంటే సుమారు 11 కోట్లు విలువ చేసె వెయ్యి రూపాయల నోట్లు, ఇంకా 30 కోట్లు విలువ చేసే 500 రూపాయల నోట్లు చెల్లనివి. సుమారు 20 కోట్ల రూపాయలు రాద్దైనవి తర్వాతి కాలం లో( నోట్ల రద్దు తర్వాత పాత నోట్లు చెల్లుబాటు అయ్యే సమయం ఎంత అంటే ఎన్ని పిల్లి మొగ్గలు వేసారో ఎన్ని డేట్ లు మార్చారో అందరికి తెలిసిందే) సేకరించినట్టు స్వయంగా ఆర్ బి ఐ తను ఇటివల వెల్లడించిన రిపోర్ట్ లో చెప్పింది. దీనికి బ్యాంకింగ్ రంగంలోకి రాని ఒక శాతం అదనం. అంటే సుమారు 15440 కోట్లు నల్ల ధనం అని తెలింది. కొత్త నోత ముద్రణ కోసం ఐన ఖర్చు సుమారు 7 వేల కోట్ల రూపాయలు. దీనికి రవాణా ఖర్చులు అదనం. అంటే తక్షణ ఉపసమనం సున్నా.

పోనీ దీర్ఘ కాలిక లక్ష్యాల సంగతి చూస్తే నవంబర్ 8, 2016 నుంచి ఇప్పటి వరకు సుమారు 8 నెలల కాలం గడిచిపొయింది.దీర్ఘ కాలంలో అందుకోవాల్సిన అంచనాల్ని కొంత మేరకైన అందుకుని వుండాలి లేదా ఆ దిశగా అడుగులు పడి వుండాలి. స్వయంగా ప్రధాన మంత్రి అడిగిన 50 రోజుల గడువు ముగిసి ఆరు నెలలు కావస్తోంది. అవినీతి రహితభారతం ఇప్పటికీ కలగానే ఉండిపోయింది. స్థూల జాతీయోత్పత్తి ఆధారం గా చూసినా 2016 చివరి త్రైమాసికనికి 6.9 గా వున్న జి. డి. పి 2017 మొదటి త్రైమాసికనికి 5.9 గా రికార్డు అయ్యి రెండో త్రైమాసికనికి దాదాపు 5.7 గా నమోదు అయ్యింది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్  ఊహించిన దానికి  ఇది అచ్చoగా సమానం అంటే 2 శాతం జి. డి. పి పడిపోతుందన్న మాట ఆక్షరాల నిజం. అమర్త్య సేన్, అరుణ్ శౌరి లాంటి ఆర్టికవేత్త లు నోట్ల రద్దు నల్ల ధనాన్ని ఎంత మాత్రం వెలికి తీయలేదు అనీ, ఎందుకంటే నల్ల డబ్బు ఇతర రూపాల్లోనే(రియల్ ఎస్టేట్, బంగారం, విదేశాలలో దాచుకున్న కరెన్సీ) ఎక్కువ ఉందనేది అందరికి తెలుసు అనీ, కోట్ల కొద్ది సామాన్యులు తమ సొంత డబ్బు తీసుకోటానికి నానా ఇబ్బందులు పడడానికి మినహా ఇది ఎందుకు పనికి రాదనీ విమర్శించారు. ఉత్పత్తి రంగంలో పెరుగుదల 10. 7 శాతం నుంచి 1.2 శాతానికి, మైనింగ్ క్వారీ రంగాలు 0.7 శాతానికి, నిర్మాణ రంగo ౩.1 నుంచి 2 శాతానికి పడిపోయాయి.

దీనివల్ల లాభపడిన రంగాలు కూడా లేకపోలేదు. ఆర్ధిక సేవలు 6.4 శాతానికి హోటల్లు సమాచార వ్యవస్థ 11 శాతం మేరకు లభపడినట్టు సమాచారం. పే. టి. ఎం లాంటి సంస్థ లైతే దీనిని సమర్తిస్తూ దాదాపుగా ఎగిరి గంతేసాయి. ఈ సంవత్సరం దాదాపుగా 90 మిలియన్ అమేరికన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధపడ్డాయంటే అవి ఎంత లాభాపడ్డాయో ఊహించోచ్చు. కొత్తగా కొన్ని మిలియన్ల సంఖ్యలో పన్ను చెల్లించేవారు చేరినట్టు దీని వల్ల ప్రభుత్వ రెవిన్యూ అమాంతంగా పెరగనున్నట్టు కూడా చెప్పుకున్నారు. గుర్తింపు ప్రధానంగా మారిపోయిన సందర్భo కనుక అధార్ లాంటి ప్రాజెక్ట్ చేపట్టిన వారికి కూడా ఇది పండగే. కానీ ఇటివల సుప్రీమ్ కోర్ట్ వ్యక్తిగత గోప్యత ప్రాధమిక హక్కుగా గుర్తిస్తూ  చెప్పిన తీర్పు ఆధార్ కీ, ఆ మాటకొస్తే అందరి గుర్తింపు, గోప్యతలు మాకే దఖలు పరచడమైనది కనుక మీ ఆర్ధిక స్వేఛ్చ కుడా మా నీడ చాటునే అని ప్రకటిoచబోయిన ప్రభుత్వానికి ఇది శరఘాతంగా  మిగలకపోలేదు. ఆర్ధిక స్వేఛ్చ లక్షల కోట్లు ఎగవేసిన వారికి వుండోచ్చు  కాని పోపు డబ్బా లో చిల్లర దాచుకోవడం ఎంత పెద్ద  నేరం?

ఆర్ధిక రంగం వృద్ది కి ప్రధానంగా దోహదం చేసేవి  పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తి రంగాలు. ఇవి విపరీతంగా నష్టపోయాయి. చిన్న పరిశ్రమలు చాల వరకు కోలుకోలేనంతగా దెబ్బ తిని మూత పడ్డాయి. దాదాపు 30 నుంచి 40 శాతం చిన్న పరిశ్రమలు విపరీతంగా దెబ్బతిన్నట్టు అంచనా. ఏడు ప్రధాన రంగాలైన బొగ్గు,క్రూడ్ ఆయిల్ సహజ వాయువు మరియు రిఫైనరీ ఉత్పత్తి రంగాలు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్య్తుత్పత్తి రంగాలు 2.4 శాతానికి పైగా నష్టపోయాయి . ఇవి కోలుకోడానికి పట్టే సమయం,దానికి కావలిసిన సహాయ సహకారాలు లాంటివి ఎలా ఏమిటి అనే ప్రణాళికలు ప్రస్తుతానికి లేవు. పాత నోట్లు పోయి కొత్త నోట్లు వచ్చినట్టు పాత పారిశ్రామిక విధానం పోయి కొత్త పారిశ్రామిక విధానం ఏమి రాలేదు కదా. ఇప్పటికే కుదేలయ్యి పోయిన చిన్న ఉత్పత్తి దారులు కొత్త నోట్లు సేకరించుకొని మళ్లీ ఉత్పత్తి మొదలు పెడతారేమో చుడాలి మరి.

నోట్ల రద్దు తర్వత ఉగ్రవాదుల కార్యకలపాల్లో కూడా పెద్దగా మార్పు లేదు. కశ్మీర్ రావణ కాష్టంలా ఇంక రగులుతునే ఉంది. సైన్యం మీదా ఉగ్రదాడులు, సైన్యం ప్రతి చర్యలు, సామన్యుల కష్టాలు పెరిగినట్టే ఉన్నాయి కాని తగ్గలేదు. చైనాతో సరిహద్దు వివాదం బోనస్(దినికి నోట్ల రద్దుకు సంబంధం ఉందో లేదో). నోట్ల రద్దు జరిగిన కొద్ది రోజుల్లోనే ఉగ్రవాదుల దెగ్గర కొత్తనోట్లు చేరిపోయి తమ పని తాము చేసేశాయి.

ఇక పొతే రాజకీయ ప్రయోజనాలు. ఇవి మాత్రం బాగా నెరవేరినట్టు వున్నాయి. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో దీని వల్ల  నేరుగా బీ.జే .పి  ప్రభంజనం వీచగా,నోట్ల రద్దు వల్ల సమకూరిన అతి విశ్వాసమో లేక ఇంకోటో వలన ఇంకో రెండు  రాష్ట్రాల ఎం. ఎల్ . ఏ లను విజయవంతంగా కొనుగోలు చేసేసి (మిజోరాం, గోవా లలో ) ప్రభుత్వాలు చకచకా ఏర్పడిపోయాయి. పంజాబ్ ను ఎందుకో కాచుకోలేక పోయింది కాని. లేకపోతే సొంత లాభం సంపూర్ణం అయ్యేదే. ఇక జనం సంగతి. ఎన్నికలప్పుడు ఇంకో  సంచలనం కోసం ఎదురు చూడండి లేదా కొత్త నోట్లు ఇప్పుడు బానే దొరుకుతున్నాయి కదా ప్రస్తుతానికి కాలక్షేపం చేసేయ్యండి. నల్ల డబ్బు ఎక్కడికి పోదు అది మీ నట్టింట్లో ఉoడోచ్చు గాక. కొన్ని రాజకీయ అనుకూలతలు ఉంటె మాత్రం ప్రస్తుతానికి మీరు సేఫే. ప్రతిపక్షాలు దీన్ని విఫల ప్రయోగంగా ఎలగూ చిత్రించలేక బోర్లా పడి మట్టి కరిచినట్టే. సంచలనాన్ని ఓడించడానికి ఇంకో సునామి యో లేక బినామీ యో రావాలి మరి. కాగల  కార్యం గంధర్వుల కెరుక!