టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంచిగా సంపాదించుకున్నారనీ, వైసీపీ వచ్చాక ఎలాంటి ఆదాయం లేకుండా పోయిందని బాధపడిన ఘటనలు ఇటీవల కాలంలో వినిపించాయి. ఈ విషయాలను గ్రహించిన పార్టీ కార్యకర్తల మేలు కోసం త్వరలో ఓ కొత్త పథకాన్ని తీసుకురాబోతోంది. ఈ విషయాన్ని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ శుక్రవారం వెల్లడించారు. కర్నూలులో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కష్టపడి పనిచేసే కార్యకర్తలను అధిష్టానం వదిలేయదనీ, వారి మేలు కోసం ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకురాబోతోంది. వచ్చే రోజుల్లో వారికి అంతా మంచే జరుగుతుంది అని వ్యాఖ్యానించారు. అటు చంద్రబాబు నాయుడుని దుయ్యబట్టారు. ఆలూరులో జింకల పార్కు, కర్నూలు స్మార్ట్ సిటీ, నేనుంటే కరోనా వచ్చేది కాదు వంటి వ్యాఖ్యలతో ఆయన మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు.