30 వేలు ఇస్తే 3 లక్షలు అన్నారు.. కామారెడ్డిలో మహామోసం  - MicTv.in - Telugu News
mictv telugu

30 వేలు ఇస్తే 3 లక్షలు అన్నారు.. కామారెడ్డిలో మహామోసం 

September 23, 2020

Financial fraud in kamareddy Beersheba food investment scam

కష్టపడి సంపాదించిన సొమ్ము ఎక్కడికీ పోదని చెప్పుకుంటాం. అదంతా పాతముచ్చట. కష్టార్జిజాన్ని గద్దల్లా తన్నుకుపోయే వాళ్లు లోకంలో కోకొల్లుగా ఉన్నాయి. ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుని బోర్డు తిప్పేసిన ఉదంతం కామారెడ్డి జిల్లా మాచారం మండలం లచ్చాపేటలో చోటుచేసుకుంది. ఏకంగా రూ. 15 కోట్లను దోచుకుని పక్కాగా మోసం చేశారు. 

బీర్షేబా ఫుడ్ సంస్థ గ్రామానికి  చెందిన 1500 మందిని నట్టే ముంచింది. తొలుత స్థానికులతో గోధుమ పిండి, సర్ఫ్, శనగపిండి పదార్థాలను ప్యాక్ చేసించి ఇతర పదార్థాల ప్యాకింగ్ చేయించి, డబ్బులు చెల్లించింది. తర్వాత రూ. 30 వేలు కడితే పది నెలల పాటు ప్రతి నెల రూ. 10 చెల్లిస్తామని ఆశ చూపింది. చక్రవడ్డీలకు ఇచ్చినా అంత డబ్బు రాదని భావించిన జనం పోలోమని డబ్బు తీసుకెళ్లి కట్టేశారు. కొందరు గొడ్డుగోదను కూడా అమ్మేసి బీర్షేబా నోట్లో పెట్టేశారు. అయితే కరోనా వైరస్ వల్ల వ్యాపారం దెబ్బతినిందని, హామీ ప్రకారం డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదని యాజమాన్యం చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ తర్వాత డబ్బులు ఇస్తారేమోనని జనం వేచి చూశారు. అన్ లాక్ 4 తర్వాత కూడా డబ్బులు చెల్లించకపోవడంతో మోసపోయమాని గుర్తించారు. బీర్షేబా యజయిని ఇస్మాయిల్‌పై కేసు పెట్టగా, పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.