20 లక్షల కోట్ల ప్యాకేజీ.. ఎవరికెంత? కేటాయింపుల చిట్టా - MicTv.in - Telugu News
mictv telugu

20 లక్షల కోట్ల ప్యాకేజీ.. ఎవరికెంత? కేటాయింపుల చిట్టా

May 13, 2020

 

Financial

దేశీయ పరిశ్రమలను బలోపేతం చేసి, దేశాన్ని అన్ని రంగాల్లో స్వయంసమృద్ధం సాధించడమే రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఉద్దేశమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రధాని మోదీ నిన్న ప్రకటించిన ఈ ప్యాకేజీ వివరాలను ఆమె మీడియాకు వివరిస్తున్నారు. మౌలిక సదుపాయాలు, వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ది, దేశీయ తయారీ పరిశ్రమకు ఊతమివ్వడం దీని ముఖ్యోద్దేశమన్నారు. బడుగు వర్గాలను ఆదుకుంటామని, జన్ ధన్ ఖాతాల ద్వారా వారికి నేరుగా సబ్సిడీలను, ఆర్థిక సాయాన్ని అందజేస్తామని ఆమె చెప్పారు.  చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోడానికి భారీ నిధులు కేటాయించారు. 

కీలక కేటాయింపులు.. 

చిన్నమధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి రూ. 3 లక్షల కోట్లు 

చిరుద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్ మెుత్తాన్ని ఆగస్టు వరకు ప్రభుత్వమే కడుతుంది. 

ఉద్యోగులకు నగదు లభ్యత పెంచేందుకు పీఎప్ కంట్రిబ్యూషన్ 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు

యాజమాన్యాల కంట్రిబ్యూషన్ మాత్రం 12 శాతంగానే కొనసాగింపు

వివిధ సంక్షేమ పథకాల కింద ప్రజలకు రూ. 52 వేల కోట్ల నగదు సబ్సిడీ

రూ .200 కోట్లలోపు సేకరణ ఒప్పందాలు కేవలం భారత కంపెనీలకు మాత్రమే 

సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడులు పరిమితి కోటికి పెంపు. 

అప్పుల ఊబిలోఉన్న కంపెనీలకు రూ. 20 వేల కోట్ల కేటాయింపు

ఎలాంటి పూచీ లేకుండా 12 నెలల మారటోరియంతో రుణాలు 

పరిశ్రమల ఉత్పత్తి స్వామర్థ్యాన్ని పెంచడానికి రూ. 10వేల కోట్లు 

పన్ను చెల్లింపుదారులకు రూ. 80 వేల కోట్ల రీఫండ్