ఇదో చిత్రమైన దరఖాస్తు చదివి తీరాల్సిందే...... - MicTv.in - Telugu News
mictv telugu

ఇదో చిత్రమైన దరఖాస్తు చదివి తీరాల్సిందే……

August 4, 2017

ఇదో చిత్ర విచిత్రమైన దరఖాస్తు.  ఇలాంటి దరఖాస్తు గురించి ఇంతకు ముందెప్పుడూ మీరు విని ఉండరు. చూసి కూడా ఉండరు. ఈ చిత్రమైన దరఖాస్తు  గురించి తెలియాలంటే. ఈ స్టోరీ చదవాల్సిందే…. కర్నాటక రాష్ట్రం గదగ్ జిల్లాకు చెందిన మంజునాథ రామప్ప పూజారా అనే  యువకునికి పెళ్లి కావడం లేదట. తనకు పిల్లను చూసి పెట్టాలని గ్రామ పంచాయితీకి దరఖాస్తు పెట్టుకున్నాడు.

దీన్ని చూసిన గ్రామ పంచాయితీ వారు ఆశ్చర్య పోయారు. ఇదేం దరఖాస్తురా బాబు అనుకన్నట్లుంది. అయితే  తనకు  పెండ్లి చేయాలని తల్లిదండ్రులు కొన్నాళ్ల నుండి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయనకు పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. తాను వ్యవసాయ దారుడైనందు వల్లనే పిల్లను ఇవ్వడం లేదని దరకాస్తులో రాశాడు. వ్యవసాయ దారుల ఇంటికి  పిల్లనివ్వక పోతే ఎట్లా అని ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. దీని గురించి ఉన్నతాధికారులకు దృష్టికితీసుకెళ్తామని గ్రామ పంచాయితీ వారు చెప్తున్నారు. వ్యవసాయ పట్ల మన సమాజంలో  ఉన్న చిన్న చూపును ఎత్తి చూపుతున్నది. ఏదైమైనా మంజునాథా నువ్వు చేసిన  పని మంచిదే అనుకోవచ్చు.