Fingerprint surgery gang in Hyderabad
mictv telugu

గల్ఫ్ దేశాలకు వెళ్లే యువకులే టార్గెట్.. హైదరాబాద్‌లో ఖతర్నాక్ మోసం

September 1, 2022

హైదరాబాద్‌లో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. నగరంలో ఫింగర్‌ ప్రింట్‌ సర్జరీ ముఠాను రాచకొండ పోలీసులు గుట్టురట్టు చేశారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు కొత్త తరహాలో ప్రయత్నాలు చేస్తున్న వారినే టార్గెట్ పెట్టుకున్నారు. గల్ఫ్ దేశాలు వెళ్లేందుకు వేలిముద్రలు తప్పనిసరి. అయితే..ఒకసారి రిజెక్ట్ అయిన యువకులు మళ్లీ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వేలిముద్రలకు ఆపరేషన్ చేసుకొని మళ్లీ వెళ్లడానికి యువకులు చేసే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని ఓ ముఠా కొత్త రకం మోసాలకు తెరలేపింది. ఏడాది పాటు వేలిముద్రలు కనబడకుండా ఉండే విధంగా ఓ డాక్టర్, సిబ్బందితో సర్జరీకి ముఠా ప్లాన్ చేసింది. సర్జరీ తర్వాత దొడ్డిదారిన గల్ఫ్ దేశాలకు యువకులు బాటపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సర్జరీ చేస్తున్న డాక్టర్‌తో పాటు సిబ్బందిని అరెస్ట్ చేశారు. ఈ కొత్త రకం మోసంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.