సంతోషకర దేశాల్లో 'ఫిన్లాండే' నెం.1.. భారత్ స్ధానం? - MicTv.in - Telugu News
mictv telugu

సంతోషకర దేశాల్లో ‘ఫిన్లాండే’ నెం.1.. భారత్ స్ధానం?

March 18, 2022

fbfvb

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ మరోసారి మొదటిస్థానంలో నిలిచింది. శుక్రవారం ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐరాస ‘ప్రపంచ ఆనంద నివేదిక – 2022’ను విడుదల చేసింది. మొత్తం 146 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో భారత్ 136వ స్థానంలో నిలిచింది. గతేడాది కంటే ఈసారి భారత్ మూడు స్థానాలు మెరుగుపర్చుకోవడం విశేషం.

ఈ సందర్భంగా ఫిన్లాండ్ ప్రథమ స్థానం జాబితాలో చేరడం.. వరుసగా ఇది ఐదోసారి. ఆ తర్వాత డెన్మార్క్ (2), ఐస్ లాండ్ (3), స్విట్జర్లాండ్ (4), నెదర్లాండ్స్(5), లగ్జెంబర్గ్ (6), స్వీడన్ (7), నార్వే (8), ఇజ్రాయెల్ (9), న్యూజిలాండ్ (10) టాప్-10లో నిలిచాయి. అగ్రరాజ్యం అమెరికా ఈ ఆనందమయ దేశాల జాబితాలో 16వ స్థానంలో ఉంది. కెనడా ఓ మెట్టుపైన 15వ స్థానంలో నిలిచింది. బ్రిటన్‌కు 17వ స్థానం లభించింది

ఇక, ఈ జాబితాలో అఫ్ఘానిస్థాన్ అట్టడుగున ఉండగా, లెబనాన్, జింబాబ్వే, రువాండాలో అల్ప సంతోషకర దేశాలుగా ప్రకటించింది. రష్యా యుద్ధంతో సతమతమవుతోన్న ఉక్రెయిన్.. ఆనందకర దేశాల జాబితాలో 98వ స్థానంలో ఉంది. రష్యా 80వ స్థానం దక్కించుకుంది. 2012 నుంచి ఐరాసకు చెందిన ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్’ ఏటా ప్రపంచ ఆనంద నివేదికను వెల్లడిస్తూ వస్తోంది.