ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్(34)పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఆమె వేసుకున్న లో-కట్ బ్లేజర్. ఇటీవల ఆమె ట్రెండీ మేగజీన్ కోసం ఫొటో షూట్లో పాల్గొన్నారు. ఆమె ఫొటోను ఆ మేగజీన్ కవర్ ఫొటోగా వేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలో ఆమె వక్షస్థలం(క్లివేజ్) కొంతమేర కనిపిస్తుంది. దీంతో నెటిజెన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవప్రదమైన ప్రధాని పదవిలో ఉండి, ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నారని ప్రశ్నిస్తున్నారు.
ఆమె ప్రధానమంత్రా? లేక మోడలా? అని మరికొందరు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమెలానే లో-కట్ బ్లేజర్ వేసుకుని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో 34 ఏళ్ల వయస్సులోనే సన్న మరీన్ ఫిన్లాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. దీంతో ప్రపంచంలోనే అతి పిన్న వయస్సులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తిగా ఆమె రికార్డు సాధించారు. గతంలో ఉక్రెయిన్‌కు చెందిన ఒలెక్సీ హాన్చరుక్ (35) ఏళ్ల వయస్సులో ప్రధానిగా ఎన్నికయ్యారు.