‘వరల్డ్‌ హ్యాపియెస్ట్‌ కంట్రీ’గా ఫిన్‌లాండ్‌...భారత్ ర్యాంక్ ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

‘వరల్డ్‌ హ్యాపియెస్ట్‌ కంట్రీ’గా ఫిన్‌లాండ్‌…భారత్ ర్యాంక్ ఎంతంటే?

March 20, 2020

hbbvgv

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్‌లాండ్ వరుసగా మూడోసారి రికార్డుల్లోకి ఎక్కింది. ఈరోజు వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఈ జాబితాను విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు సుమారు 156 దేశాల ప్రజల జీవన స్థితిగతులు, సంతోషకరమైన జీవనశైలిని పరిశీలించి ఈ జాబితాను రూపొందించారు. జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయి వంటి అంశాల పట్ల ఫిన్‌లాండ్‌ ప్రజలు సంతోషంగా ఉన్నారని పరిశోధనలో వెల్లడైంది. 

ఇక సంతోషకర నగరాల జాబితాలో ఫిన్‌లాండ్ రాజధాని హెల్సింకి టాప్‌లో నిలిచింది. ఇక అతి తక్కువ సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో ఆఫ్గనిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇండియా విషయానికి వస్తే అతి తక్కువ సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో 10వ స్థానాల్లో నిలిచింది. ఇక అతి తక్కువ సంతోషంగా ఉన్న నగరాల జాబితాలో ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్ నిలిచింది. ఇండియా నగరాల విషయానికి వస్తే అతి తక్కువ సంతోషకర నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ ఏడవ స్థానంలో నిలిచింది.