సాకర్ ఆటగాడిని పెళ్లాడిన ప్రధానమంత్రి..  ఇప్పటికే ఓ కూతురు - MicTv.in - Telugu News
mictv telugu

సాకర్ ఆటగాడిని పెళ్లాడిన ప్రధానమంత్రి..  ఇప్పటికే ఓ కూతురు

August 4, 2020

Finland's Prime Minister Sanna Marin Marriage.

ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్సులో ప్రధాని అయిన మహిళగా చరిత్రకెక్కిన సనా మారిన్(34)‌ ఓ ఇంటివారయ్యారు. తన ప్రియుడు, సాకర్‌ ఆటగాడు అయిన మార్కస్‌ రాయ్కెన్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ గత పదహారేండ్లుగా సహజీవనం చేస్తున్నారు. 

 

వీరిద్దరికి ఎమ్మా అమైలా మారిన్‌ అనే రెండేండ్ల కూతురు ఉంది. 2019లో డిసెంబర్‌లో ఆమె ఫిన్‌లాండ్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెల్సిందే. ఈ విషయం అప్పట్లో సంచలనం రేపింది. ఈ పెళ్లిపై ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ..’నేను ప్రేమించిన పెళ్లి చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో పెళ్లి ఫొటోలను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా, సనా మారిన్‌- మార్కస్‌ల వివాహం ప్రధాని అధికారిక నివాసంలో అత్యంత నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్ళికి కేవలం 40 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు.