కుక్క తెచ్చిన పంచాయితీ.. మనవడిపై బామ్మ కేసు - MicTv.in - Telugu News
mictv telugu

కుక్క తెచ్చిన పంచాయితీ.. మనవడిపై బామ్మ కేసు

May 10, 2022

చెప్పిన మాట వినకపోవడం.. అతడి కారణంగానే కుక్క కాటుకు గురికావడంతో ఓ బామ్మ తన మనవడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విచిత్ర సంఘటన ఢిల్లీలోని జగత్పురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని శివపురి సిల్వర్ పార్క్లో 75 ఏళ్ల రమాదేవి తన కూతురు, అల్లుడుతో నివాసముంటోంది. ఆమెకు ఇద్దరు మనువళ్లు.

తన మనవళ్లలో ఒకరైన జతిన్.. 9 నెలల క్రితం ఓ కుక్కను ఇంటికి తెచ్చి, దానిని పెంచుతున్నాడు. కుక్కను కట్టివేయకుండా ఇంట్లోనే ఉంచడం వల్ల అది మొరుగుతూ ఇతరులను కరిచేది. కుక్కను కట్టివేయమని ఎంత చెప్పినా అతడు ఆమె మాట వినలేదు. మే 5న ఉదయం 11:30 గంటలకు ఇంటిని శుభ్రం చేస్తుండగా రమాదేవిని ఆ కుక్క కరిచింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బామ్మ ఫిర్యాదు మేరకు మనవడిపై చర్యలు తీసుకుంటామని పోలీసుల తెలిపారు.