కంగనపై దేశద్రోహం కేసు.. ఆమె తగ్గదు, అంతే! - MicTv.in - Telugu News
mictv telugu

కంగనపై దేశద్రోహం కేసు.. ఆమె తగ్గదు, అంతే!

October 17, 2020

gbgngj

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ అటు సినిమాలు చేసుకుంటూనే ఇటు వరుస వివాదాలను రాజేస్తోంది. యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత కంగనా వరుస వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మీద కర్ణాటకలో దేశద్రోహం కేసు నమోదు అయింది. అయితే తన మీద ఇలాంటివి ఎన్ని కేసులు పెట్టినా కంగనా తగ్గదు అని సోషల్ మీడియాలో ఆమెకు మద్దతు పలుకుతున్నవారు ఎందరో. బాలీవుడ్ అంతా డ్రగ్స్ మురికితో పేరుకుపోయిందని, బాలీవుడ్‌లో డ్రగ్స్ కంపు లేని పార్టీ ఒక్కటి కూడా ఉండదని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 

ముంబైని పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌గా పోల్చడంతో మరింత దూమారం రేగింది. దీంతో తాజాగా ఆమె తీరును తప్పుబడుతూ కాస్టింగ్ డైరెక్టర్, ఫిట్‌నెస్ ట్రైనర్ మునవర్ అలీ సయ్యద్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కంగనా చేస్తున్న ట్వీట్లు, పలు ఛానళ్లలో ఇస్తున్న ఇంటర్య్వూలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ మునవర్ అలీ  ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రో పాలిటన్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. ముంబై పోలీసులను బాబర్స్ అని ఆమె పోల్చడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ఫిర్యాదు పరిశీలించి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రో పాలిటన్ కోర్టు ఆదేశించింది. దీంతో ముంబై పోలీసులు వారిద్దరిపై దేశ ద్రోహం కేసు కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
కాగా, మహారాష్ట్ర సర్కారుతో ఢీ అంటే ఢీ అన్న రేంజులో పోరుకు కాలు రువ్విన కంగనా ఏమాత్రం తగ్గడంలేదు. ఆమె కార్యాలయాన్ని కూడా బృహన్ ముంబై అధికారులు కూల్చివేసినా ఆమె ఎక్కడా తొణకలేదు. పైపెచ్చు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం మీద కత్తి నూరింది. మరి తాజా కేసుపై కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి.