కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు.. కూరగాయలు పంపిణీ చేశారని - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు.. కూరగాయలు పంపిణీ చేశారని

March 26, 2020

FIR Against Puducherry MLA for Violating Lockdown  

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ప్రజలు ఎవరూ రోడ్లపైకి రాకూడదనే ఆదేశాలు ప్రభుత్వాలు ఇచ్చాయి. గుంపులుగా తిరగడంపై నిషేదం విధించారు. మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరం పాటించాలని సూచించారు. కానీ వీటిని పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ కూరగాయలు పంపిణీ చేయడమే దీనికి కారణం. 

పుదుచ్చేరిలో ఎమ్మెల్యే జాన్ కుమార్‌ స్థానిక ప్రజల కష్టాలు తీర్చేందుకు కూరగాయలు పంచారు. తన ఇంటి వద్ద సుమారు 200 మందికి వీటిని పంపిణీ చేశారు. అయితే ప్రజలు గుంపులు గుంపులుగా రావడంతో లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. సామాజిక దూరం విషయాన్ని ఆయన ఏ మాతరం పట్టించుకోలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్ వ్యాపించకుండా ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని చెబుతుంటే ప్రజా ప్రతినిధి వాటిని ఉల్లంఘించడమేంటని అంటున్నారు. దీంతో జాన్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.