స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన చేసిన గాయాలు ఇంకా మానకముందే హైదరాబాద్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మైలార్‌దేవ్‌పల్లి శాస్త్రిపురంలో ఓ ప్లాస్టిక్ గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో గోడౌన్లో ఉన్న రెండు డీసీఎం వాహనాలు మంటల్లో కాలిపోయాయి.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమంచుతో పేరుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది. గోదాంలో విలువైన సామాగ్రి ఉంది. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న పంటలతో అవి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.