హైటెక్ సిటీ వద్ద ఘోరం.. 330 కుటుంబాలకు కన్నీళ్లు - MicTv.in - Telugu News
mictv telugu

హైటెక్ సిటీ వద్ద ఘోరం.. 330 కుటుంబాలకు కన్నీళ్లు

March 22, 2018

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ వద్ద అగ్నిదేవుడు బీభత్సం సృష్టించాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పత్రికా నగర్‌లో గురువారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 330 గుడిసెలు నామరూపాల్లేకుండా పోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేస్తున్నారు.

బాధితులంతా కూలీనాలీ చేసుకునేవారే. ఏపీ, ఒడిశా, కర్ణాటక తదితర ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చి గుడిసెలు వేసుకున్నారు. వారు పనులకు వెళ్లడంతో గుడిసెల్లో ఎవరూ లేరు. దీంతో ప్రాణాపాయం తప్పింది. బాధితులు విషయం తెసుకుని భోరున విలపిస్తున్నారు. కష్టపడి గుడిసెలు వేసుకున్నామని, సామాన్లు, కాస్తో కూస్తో దాచుకున్న డబ్బు, బట్టలు మొత్తం కాలిబూడిదయ్యాయని రోదిస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకుని పునరావాసం, తక్షణ సాయం అందించాలని కోరుతున్నారు.