హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..

April 17, 2019

హైదరాబాద్ మొజంజాహీ మార్కెట్‌ సమీపంలోని హందీనగర్ లోని ఓ ఫర్నిచర్ గోదాములో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అధిక మొత్తంలో మంటలు ఎగిసి పడుతుండటంతో కాలనీ వాసులు భయంతో పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అబిడ్స్, బేగంపేట పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ  ఆపరేషన్ చేపట్టారు. మరిన్ని ఫైరింజన్లను అక్కడికి తెప్పిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కాగా షార్ట్ సర్క్యూట్ ద్వారానే ప్రమాదం జరిగిందని, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, కానీ భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో అక్కడ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.