Fire accident in Miami airport usa
mictv telugu

ఢీకొడుతూ కాలిపోయిన విమానం.. అందులో 126 మంది

June 22, 2022

126 మంది ప్రయాణికులతో ల్యాండ్ కాబోతున్న విమానం ఒక్కసారి అదుపు తప్పి, రన్ వే దాటిపోయి.. రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ కారులా బీభత్సం సృష్టించి,  కాలిపోయింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ఏమీ కాలేదు. ముగ్గురు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగింది.

రెడ్ ఎయిర్‌కు చెందిన విమానం ఫ్రంట్‌ ల్యాండింగ్ గేర్‌ మొరాయించడంతో ప్రమాదానికి గురైనట్లు అధికారులు నిర్ధారించారు. డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగో నుంచి వస్తున్న విమానం ల్యాండ్‌ అవుతుండగా రన్ వే నుంచి జారిపోయి మంటల్లో చిక్కుకుంది. వేగంగా దూసుకెళ్లి క్రేన్ టవర్‌ను, తర్వాత అక్కడి భవనాన్ని, అడ్డొచ్చిన సామగ్రిని ఢీకొట్టింది. ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రాయణికులు ప్రాణభయంతో అరుపులు కేకలు వేశారు. విమానాశ్రయంలోని అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. ప్రయాణికులను సుక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ముగ్గురికి చిన్నపాటి గాయాలయ్యాయి.