ముంబై షాపింగ్ మాల్ లో ఘోర అగ్నిప్ర‌మాదం - MicTv.in - Telugu News
mictv telugu

ముంబై షాపింగ్ మాల్ లో ఘోర అగ్నిప్ర‌మాదం

July 11, 2020

vc vcn

మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు.. విపరీతంగా పెరుగుతోన్న కరోనా కేసులతో సతమతం అవుతోన్న ముంబై నగరాన్ని అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా ప‌శ్చిమ బోరివాలిలో శ‌నివారం ఉదయం గజారా అగ్నిప్రమాదం జరిగింది. 

దీంతో అగ్నిమాపక సిబ్బంది 14 ఫైర్ ఇంజ‌న్లతో మంట‌ల‌ను ఆర్పుతున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ప్రాణ‌న‌ష్టం లేదా ఆస్తిన‌ష్టం ఏమైనా జ‌రిగాయా అన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ‌త నెల‌లోనూ ద‌క్షిణ ముంబైలోని నారిమ‌న్ పాయింట్ వ‌ద్ద బ్యాంక్ ఆఫ్ బ‌హ్రెయిన్, కువైట్ కార్య‌క‌లాపాల్లో అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా క్రాఫోర్డ్ మార్కెట్‌లోని ప‌లు దుకాణాల్లో కూడా మంట‌లు చెలరేగాయి.