నెల్లూరు కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాద ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. కీలక పత్రాలు, పలు కేసులకు సంబంధించిన ఫైళ్లు ఉన్న కలెక్టర్ కార్యాలయంలో తరచూ మంటలు మంటలు చెలరేగడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే కలెక్టరేట్‌లో రెండు సార్లు అగ్నిప్రమాదాలు జరిగి కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించిన ఫైళ్లు దగ్ధం అయ్యాయి.
తాజాగా మరోసారి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచిన పాత ఎన్నికల సామగ్రి కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ సారి జరిగిన ప్రమాదంలో ఏ ఏ ఫైళ్లు దగ్ధం అయ్యాయి, ఎంతవరకు నష్టం కలిగిందని అనే అంశాలు తెలియాల్సి ఉంది. ఈ రోజు సెలవు దినం కావడంతో కార్యాలయంలో సిబ్బంది ఎవరూ హాజరు కాలేదు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నారు.