తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం

September 2, 2017

తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రసాదాలు తయారు చేసే పోటు(వంటశాల)లో గ్యాస్ పొయ్యి నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు లేచాయి.  లడ్డూ కోసం బూందీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ గాయాలు కాలేదు. మంటలు పెద్ద ఎత్తున్న ఎగసి పడుతున్నాయి. వంటశాల, పరిసరాల్లో దట్టమైన పొగ అలముకుంది. విషయం తెలుసుకున్న తిరుమలలోని అగ్నిమాపక సిబ్బంది వెంటనే గుడికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదం వల్ల ప్రసాదాల వంటకాల తయారీని నిలిపేశారు. గత ఏడాది కూడా లడ్డూ పోటులో అగ్నిప్రమాదం జరిగింది. సరైన భద్రత లేకపోవడం, కొంతమంది కార్మికుల నిర్లక్ష్యం,  ప్రసాదాలను భారీ ఎత్తులో తయారు చేయాల్సి రావడం తదితర కారణాలతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.