విశాఖలోని రాంకీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖలోని రాంకీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

July 14, 2020

vvxv

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో ఇటీవల జరిగిన గ్యాస్ లీక్ సంఘటన మరువకముందే మరో ప్రమాదం జరిగింది. పరవాడలోని పరవాడలోని జవహరలాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న రాంకీ ఎస్‌ఈటీపీ సాల్వెంట్‌ పరిశ్రమలో సోమవారం అర్థరాత్రి ట్యాంకు పేలింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలు మరో రెండు ట్యాంకులకు అంటుకుని దట్టంగా పొగలు అలుముకున్నాయి. 

ట్యాంకులో మిథనాల్‌ సాల్వెంట్‌ నిల్వ ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సుమారు ఐదు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పింది. ప్రమాద సమయంలో ఫార్మా కంపెనీలో నలుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మల్లేశ్వరరావు అనే కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని గాజువాక ఆస్పత్రికి తరలించారు. భారీ పేలుళ్లతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలాన్ని డీసీపీ, ఆర్డీవో పరిశీలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.