ఏపీలోని ఆ జిల్లాకు కార్చిచ్చు హెచ్చరిక - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలోని ఆ జిల్లాకు కార్చిచ్చు హెచ్చరిక

April 8, 2022

ap

వేసవి కాలం పూర్తిస్థాయిలో ప్రారంభం కాకముందే ఎండలు మండిపోతున్నాయి. దాంతో పలు చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వేసవిలో అడవులు ఉన్న చోట కార్చిచ్చులు సంభవించే అవకాశాలున్నాయని పర్యావరణం, ఇంధనం, నీటివనరుల పర్యవేక్షణ మండలి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో కనీసం 30 జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని సర్వే నివేదికను వెల్లడించింది. 30 జిల్లాల్లో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, పక్క రాష్ట్రమైన ఒడిషాలోని కుందమాల్ జిల్లాలు ఈ ప్రమాదానికి గురి కావచ్చని పేర్కొంది. వాతావరణంలో మార్పుల వల్ల ఇలాంటి పరిణామాలు సహజంగా చోటుచేసుకుంటాయని, దీనికి నియంత్రించడం ఒక్కటే మార్గమని సూచించింది. అధిక వర్షాల నుంచి తీవ్ర వర్షాభావం వరకు లేదా, తీవ్ర వర్షాభావం నుంచి అధిక వరదల వరకు మార్పులు సంభవించే ప్రాంతాల్లో ఎక్కువగా కార్చిచ్చులు జరుగుతున్నట్టు సంస్థ పేర్కొంది. ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు నిధులు కేటాయించడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరింది. అడవుల పునరుద్ధరణ, అటవీ విస్తీర్ణం పెంచడం వంటి చర్యల ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని సంస్థ ప్రతినిధి అవినాశ్ మహంతి తెలిపారు. దీనికి ఉదాహరణగా అమెజాన్ అడవుల ప్రస్తుత పరిస్థితిని గమనించాలని వివరించారు.