ముంబైలోని షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

ముంబైలోని షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

October 23, 2020

bgbfgb

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ముంబైలోని నాగ్‌పడ ఏరియాలోని సిటీ సెంటర్ మాల్‌లో గురువారం రాత్రి దాదాపు 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే 20 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. శుక్రవారం ఉదయం వరకు మంటలు అదుపులోకి రాలేదు. 

అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన జరిగిన సమయంలో దాదాపు 300 మంది మాల్‌లో ఉన్నారు. ఈ ప్రమాదం సమయంలో మాల్‌లో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మాల్‌ పక్కనే ఉన్న 55 అంతస్తుల భవనాన్ని ఖాళీ చేయించి దానిలో ఉన్న 3500 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ప్రమాదంలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాద తీవ్రతను అగ్నిమాపక సిబ్బంది లెవల్ 5 గా నిర్దారించింది.