Fire in Railinjan. Passengers jumped into the river in america
mictv telugu

వీడియో : రైలింజన్‌లో మంటలు.. భయంతో నదిలో దూకేసిన ప్రయాణీకులు

July 22, 2022

అమెరికాలో నది వంతెనపై ప్రయాణిస్తున్న రైలింజనులో మంటలు చెలరేగాయి. దీంతో భయపడిన ప్రయాణీకులు వంతెన కింద ఉన్న నదిలో దూకేశారు. మరికొందరు కిటికీల గుండా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బోస్టన్ శివార్లలోని నదీ వంతెనపై వెల్లింగ్‌టన్, అసెంబ్లీ స్టేషన్‌ల మధ్య ప్రయాణించే ఆరెంజ్ లైన్ రైలు వెళ్తోంది. ఈ క్రమంలో రైలు హెడ్ కార్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని పసిగట్టిన దాదాపు 200 మంది ప్రయాణికులు అప్రమత్తమయ్యారు. కొందరు బోగీల కిటికీల గుండా తప్పించుకోగా, ఓ మహిళ మాత్రం రైలు నుంచి కింద ఉన్న నదిలో దూకేసింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగి ప్రయాణీకులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. నదిలో దూకేసిన మహిళ మాత్రం వైద్య సహాయానికి నిరాకరించింది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు మసాచుసెట్స్ బే ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ వెల్లడించింది.