మంటలా మజాకా ! - MicTv.in - Telugu News
mictv telugu

మంటలా మజాకా !

June 14, 2017

అప్పట్లో పల్లెటూళ్ళలో పూరిగుడిసెలు, పెంకుటిళ్ళు, గడ్డి వామలు తగలబడేవి. వూళ్ళల్లో వుండే కొందరు పెద్దయ్యాక సిటీకెళ్ళి మాంచి బిల్డింగ్ కట్టుకుంటానని అనుకునేవారు. కానీ చూసారా.. నిప్పుకి పూరిగుడిసె అయినా, అపార్ట్ మెంట్లైనా ఒక్కటే అన్నట్టు తయారైంది పరిస్థితి ? గుడిసెలు కాలిపోయే స్థానంలో బిల్డింగులే తగలబడుతున్నాయి కదా. బిల్డింగుల్లో ఏయిర్ కండిషన్, ఫాల్ సీలింగ్, ఉడెన్ వర్క్ తో ఇల్లు చాలా పాష్ గా కన్పించాలని ఇల్లంతా జిగేల్ లైట్లతో భూతల స్వర్గంలా కట్టుకుంటున్నారు. కానీ అవి ఎక్కడ ఏ చిన్న స్పార్క్ జరిగినా మొత్తం కాలి బూడిదవాల్సిందేగా.. మొన్నటికి మొన్న స్టార్ మా టీవీ కొత్త బిల్డింగులో ఒక ఫ్లోర్లో మంటలంటుకున్నాయి. అంతకు ముందు ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయంలో కూడా మంటలు అంటుకున్నాయి. ఇలా హైదరాబాదులో చాలా బిల్డింగులు తగులబడ్డాయి.

https://www.youtube.com/watch?v=cOoYDiufWQw

లండన్ లో కూడా జరిగిన ఈ ఉదంతం చాలా విస్మయానికి గురి చేస్తోంది. 27 అంతస్థుల ‘ గ్రెన్ ఫిల్ ’ అనే బిజినెస్ అపార్ట్ మెంటు అది. సడన్ గా ఏమైందో గానీ 24 వ ఫ్లోర్ నుండి చిన్నగా మంటలు రాజుకున్నాయట. తేరుకునేలోపే మొత్తం బిల్డింగ్ కు మంటలు చుట్టుముట్టేసాయి. అందులో వున్నవాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి పైనుంచి కిందికి దూకేసారట. ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు, 45 మంది వరకు గాయ పడ్డారని అంచనా. కానీ అందులో ఇంకెంత మంది ఆహుతయ్యారో తేలాలంటే టైం పడుతుందేమో. అప్పటికి 45 ఫైరింజన్లు, 200 మంది ఫైర్ ఫైటర్లు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసారట. ఈ మంటలకు మ్యాగ్జిమమ్ కరెంట్ స్పార్కే కారణమై వుండొచ్చనేది ప్రాథమిక అంచనా. ఈ చల్లని ఏసి వల్ల గ్యాసు పేలితే మంటలు మరింత విస్తృతమౌతాయి. పైగా ఫాల్ సీలింగుకు వాడే లప్పం కూడా అగ్గిని ఆకర్షిస్తుంది. బహుశా అందుకే ఇలాంటి ఫైర్లు బల్డింగులలో జరుగుతున్నాయేమో. మంటలా మజాకా !!