Firecracker Factory Explosion In Tamil Nadu’s Madurai
mictv telugu

భారీ అగ్నిప్రమాదం..ఐదుగురు మృతి

November 10, 2022

Firecracker Factory Explosion In Tamil Nadu’s Madurai

తమిళనాడులోని బాణసంచా తయారీ కేంద్రాలు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. తాజాగా మధురైలోని ఓ క్రాకర్స్ తయారీ కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. క్రాకర్స్ తయారీ చేస్తుండగా సంభవించిన పేలుడుతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పేలుడు ధాటికి ఘటనా స్థలంలో భవనం నేలమట్టమైంది. కొన్ని మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరి పడ్డాయి.