Firemen remove vessel stuck on toddler’s body, another’s stuck in the iron grills
mictv telugu

వాడో రకం, వీడో రకం.. గ్రిల్స్‌లో తలకాయ, బిందెలో బాడీ

June 4, 2022

Firemen remove vessel stuck on toddler’s body, another’s stuck in the iron grills

తమిళనాడులోని తంజావూరులో ఒకటిన్నరేళ్ల బాలుడి తల.. వరండా మీద ఉన్న ఇనుప గ్రిల్స్‌లో ఇరుక్కుంది. కుంభకోణం పట్టణానికి చెందిన విజయ్ ఆనంద్- కీర్తిక దంపతులు ఓ బిల్డింగ్‌లోని ఫస్ట్ ఫ్లోర్‌లో నివసిస్తున్నారు. తల్లిదండ్రులు ఇంట్లో పనిచేసుకుంటుండగా.. బాలుడు వరండాలో ఆడుకుంటున్నాడు. బయట నుండి ఒక్కసారిగా చిన్నారి ఏడుపు వినిపించేసరికి దంపతులు బయటకు వచ్చారు. ఇనుప గ్రిల్స్ లో బాలుడి తల ఇరుక్కుని ఉండడం చేసి.. కంగారు పడ్డారు. వెంటనే పొరుగువారి సాయంతో గ్రిల్స్‌ను పక్కకు జరిపి.. చిన్నారిని కాపాడారు.

Firemen remove vessel stuck on toddler’s body, another’s stuck in the iron grills

మరోవైపు, ఇదే రాష్ట్రంలోని విల్లుపురంలో మూడేళ్ల బాలుడు ఇత్తడి బిందెలో ఇరుక్కుపోయాడు. ఇంటి బయట ఖాళీ బిందెతో ఆడుకుంటున్న బాలుడు.. అకస్మాత్తుగా అందులో ఇరుక్కున్నాడు. తల భాగం మాత్రమే పైకి ఉండి, మొత్తం శరీరం బిందెలో ఇరుక్కుపోయింది. బాలుడి తల్లిదండ్రులు అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరకు తిరునెన్నై నల్లూర్ అగ్నిమాపక దళ కార్యాలయానికి తీసుకెళ్లారు. గంటసేపు కష్టపడ్డ ఫైర్ సిబ్బంది.. కట్టర్లను ఉపయోగించి.. బిందెను కత్తిరించారు. అనంతరం చిన్నారిని బయటకు తీశారు.