అలర్ట్ : ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు, తండ్రీ కూతుళ్ల సజీవ దహనం - MicTv.in - Telugu News
mictv telugu

అలర్ట్ : ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు, తండ్రీ కూతుళ్ల సజీవ దహనం

March 26, 2022

కాలుష్యం, చమురు ధరల పెరుగుదల కారణంగా ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వాటి పట్ల తగు జాగ్రత్తగా ఉండాలి. ఏ వాహనమైనా, వస్తువు అయినా ఎలక్ట్రానిక్ పరికారలకు ఛార్జింగ్ ఎంతవరకు అవసరమో అంతే పెట్టాలి. రాత్రంతా ఛార్జింగ్ పెడితే అవి కొన్ని సార్లు పేలిపోయి మనషులు ప్రాణాలు బలితీసుకుంటాయి. ఇలాంటి ఘటన ఒకటి తమిళనాడులో జరిగింది. వివరాలు.. వేలూరులో ఉండే తిరువణ్ణామలై మూడ్రోజుల క్రితం ఓ ఎలక్ట్రిక్ బైక్ 95 వేలకు కొన్నాడు. ఇంటికి తీసుకొచ్చి రాత్రి ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఎలక్ట్రిక్ బైక్‌లోని బ్యాటరీకి మంటలంటుకొని దగ్ధమైంది. అనంతరం పక్కనే పార్కింగ్ చేసి ఉన్న పెట్రోల్ బైక్‌కు మంటలు అంటుకోవడంతో ఇల్లంతా మంటలు వ్యాపించి తగలబడిపోయింది. ఈ మంటల్లో ఇంటి యజమానితో పాటు అతని 13 ఏళ్ల కూతురు సజీవ దహనమైపోయారు. ఈ ప్రమాదం రాత్రి వేళ జరగడంతో స్థానికులు శాయశక్తులా మంటలార్పేందుకు ప్రయత్నించారు. కానీ, మంటలు అడ్డుగా ఉండడం, అప్పటికే ఇల్లు మొత్తం మంటలు వ్యాపించడంతో ఇంట్లోకి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది.