కట్టెలపొయ్యి వాడి, 5 లక్షల మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

కట్టెలపొయ్యి వాడి, 5 లక్షల మంది మృతి

October 31, 2017

భారత్‌లో కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. జల కాలుష్యం,  వాయు కాలుష్యం ఫ్యాక్టరీల నుంచి వెలుబడే పొగ, రసాయనాల వల్ల ప్రతి ఏటా లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంట్లోని కాలుష్యం అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది.

కేవలం ఇంటి కాలుష్యం వల్లనే 2015లో భారత్‌లో  ఐదు లక్షల మంది మరణించారు. ‘మెడికల్ జర్నల్ లాన్సెంట్ ’అనే సంస్థ  తొలిసారిగా కాలుష్యం వలన మరణాల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం  పీఎం 2.5 అనే కాలుష్యం వల్ల భారత్‌‌లో ఐదు లక్షల మంది బలి అయ్యారు. వీరిలో 1.24 లక్షల మందికి అకాల మరణాలు సంభవించాయి .

కట్టెలు, బొగ్గువంటి ఘన పదార్థాలను మండివచడం ద్వారా వెలువడే కాలుష్యం వలన పొగ  ఊపిరితిత్తులు,రక్తకణాల్లో కలిసిపోతుందని వైద్యులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల ఇంకా కట్టెల పొయ్యిలనే ఉపయోగిస్తున్నారు. దీన్ని నుంచి వెలువడే కాలుష్యం వల్ల అనేక రోగాలు వ్యాపిస్తున్నాయి. వంట చేసే మహిళలే గాక, ఇంట్లోని  పిల్లలు  ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ కాలుష్యం బారిన పడి మరణిస్తున్నారని లెన్సెంట్ నివేదిక పేర్కొంది.