విశాఖలో ఎన్కౌంటర్ ఇద్దరు గిరిజనుల మృతి - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖలో ఎన్కౌంటర్ ఇద్దరు గిరిజనుల మృతి

March 16, 2019

విశాఖపట్నం మన్యం ప్రాంతంలోని పెదబయలు మండలం.. పెద్దకోడపల్లి సమీపంలోని బురద మామిడి వద్ద వేటగాళ్లకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు వేటగాళ్లు ఘటనాస్థలిలోనే మృతిచెందగా ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు.

Firing between police and animal hunters in Vizag two hunters died.

 

సంఘటన జరిగిన స్థానంలో పోలీసులు రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇరవై మంది వేటగాళ్లు తమపై కాల్పులు జరిపారని ఆత్మరక్షణ కోసం మేము కూడా ఫైరింగ్ చేశామని పోలీసులు తెలిపారు. కానీ స్థానిక గ్రామస్తుల వాదన మరోలా ఉంది. ఇద్దరు గిరిజనులను పోలీసులు పొట్టన పెట్టుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతదేహాలను తీసుకొని వెళ్లడానికి వచ్చిన పాడేరు పోలీసులను గ్రామస్తులు చుట్టుముట్టారు.