ఎదురు కాల్పుల్లో 9మంది ఉగ్రవాదులు హతం - MicTv.in - Telugu News
mictv telugu

ఎదురు కాల్పుల్లో 9మంది ఉగ్రవాదులు హతం

April 5, 2020

Firing in jammu and kashmir

ఒకవైపు ప్రపంచామంతా కరోనా వైరస్ ప్రభావంతో తలకిందులు అవుతుంటే.. మరోవైపు భారత్ లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జమ్ముకాశ్మీర్‌లో గడిచిన 24 గంటల్లో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో తొమ్మిదిమంది ఉగ్రవాదులు హతమయ్యారు. 

దక్షిణ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు చేసిన దాడుల్లో ఇటీవల నలుగురు పౌరులు మృతిచెందారు. పౌరులపై దాడి తర్వాత భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. 

భద్రతా బలగాలా కాల్పుల్లో బత్‌పురా వద్ద శనివారం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈరోజు ఉదయం కూడా కెరాన్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద భారత బలగాలు చేసిన దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదుల్ని సైనికులు హతమార్చారు. అయితే ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందగా ఇద్దరికీ గాయాలయ్యాయి.