Firing in Kashmir..Two killed
mictv telugu

కశ్మీర్‌లో కాల్పులు..ఇద్దరు హతం

September 15, 2022

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఈ విషయాన్ని కాసేపటిక్రితమే జమ్ముకశ్మీర్‌ పోలీసులు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘శ్రీనగర్‌ జిల్లాలోని నౌగామ్‌ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే నిర్ధిష్టమైన సమాచారంతో ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసులం కలిసి గాలింపు చర్యలు చేపట్టం. ఈరోజు ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాం” అని అధికారులు పేర్కొన్నారు.

 

అయితే, కాల్పుల్లో మృతి చెందినవారు..అన్సార్‌ ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌ సంస్థకు చెందిన అజీజ్‌ రసీ నాజర్‌, షాహిద్‌ అహ్మద్‌గా గుర్తించామన్నారు. పుల్వామాలో ఈ నెల 2న పశ్చిమబెంగాల్‌కు చెందిన మునీర్‌ ఇస్లామ్‌ అనే కార్మికుడిపై జరిగిన ఉగ్రదాడిలో వీరిద్దరి హస్తముందని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఏకే రైఫిల్‌, రెండు పిస్తోల్‌లు, ఆయుధ సమాగ్రిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు వివరాలను వెల్లడించారు.