Firing on Telangana Police..Parar is the main accused
mictv telugu

తెలంగాణ పోలీసులపై కాల్పులు..ప్రధాన నిందితుడు పరార్

August 15, 2022

Firing on Telangana Police..Parar is the main accused

తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులపై బీహార్ రాష్ట్రంలో కొంతమంది సైబర్ నేరగాళ్లు కాల్పులు జరిపారు. ఆదివారం సాయంత్రం సైబర్‌ క్రైమ్‌ కేసులో నేరస్తులైన కొందరిని బీహార్‌ నుంచి హైదరాబాద్‌ నగరానికి తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఉన్నతాధికారులు తెలియజేశారు.

”బీహార్‌కు చెందిన మిథిలేశ్‌ అనే వ్యక్తి అతడి గ్యాంగ్‌తో కలిసి సైబర్‌ నేరాలకు పాల్పడి, హైదరాబాద్ నగరంలోని పలువురిని నిండా ముంచాడు. బాధితుల ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం. ఈనెల 11న బీహార్‌లోని నవాడాకు వెళ్లాం. నేరగాళ్లు అక్కడే ఉన్నట్లు గుర్తించి నలుగురిని అరెస్టు చేసి తీసుకు వస్తుండగా వారు మాపై కాల్పులు జరిపి, పారిపోయారు. ఈ ఘటనలో మాకు ఏలాంటి ప్రాణనష్టం జరగలేదు. అందరం సురక్షితంగా తప్పించుకున్నాం. కానీ, ప్రధాన నిందితుడు మిథిలేశ్‌ తప్పించుకున్నాడు” అని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో పోలీసులు సురక్షితంగా తప్పించుకోవడమే కాకుండా, నేరగాళ్ల నుంచి రూ.1.22 కోట్లు నగదు, 3 లగ్జరీ కార్లు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.