ఏపీ సీఎం జగన్కు ఇచ్చిన మొదటి చాన్సే చివరి చాన్స్ అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. జగన్ తన తల్లిని, చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేశారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేనివారు రాష్ట్రానికేం చేస్తారు. త్వరలోనే ఆన్లైన్ సభ్యత్వాల నమోదు ప్రక్రియ ప్రారంభిస్తాం” అని చంద్రబాబు అన్నారు.
అంతేకాకుండా జగన్ దగ్గర డబ్బు, అధికారం ఉంటే, టీడీపీకి వద్ద ప్రజాబలం ఉందన్నారు. పని చెయ్యని నాయకులను పార్టీ భరించాల్సిన అవసరం లేదని నేతలకు హెచ్చరించారు. టీడీపీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు, ఎన్టీఆర్ 100వ జయంతి, మహానాడుకు ప్రాధాన్యం ఇస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.