ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి కన్నుమూత

May 29, 2020

first chief minister of Chhattisgarh Ajit Jogi passed away in Raipur

ఛత్తీస్‌గఢ్‌ తొలి ముఖ్యమంత్రి అజిత్‌ జోగి(74) కన్నుమూశారు. ఈ విషయాన్ని అజిత్‌ తనయుడు అమిత్‌ జోగి ట్విటర్‌లో వెల్లడించారు. గత కొన్నాళ్లుగా రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. 

1946 ఏప్రిల్‌ 29న బిలాస్‌పూర్‌లో జన్మించిన అజిత్‌.. భోపాల్‌ మౌలానా అజాద్‌ కాలేజ్ విద్యనభ్యసించారు. 2000-2003 మధ్య కాలంలో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకుముందు 1981-85 మధ్య భోపాల్‌ జిల్లా కలెక్టర్‌గానూ సేవలందించారు. కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 1986-98 మధ్య కాలంలో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 1998, 2004లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి 2016లో జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌ పార్టీని స్థాపించారు.