చిన్నారుల కోసం ఓ పోలీస్ స్టేషన్.. ఎక్కడో తెలుసా.? - MicTv.in - Telugu News
mictv telugu

చిన్నారుల కోసం ఓ పోలీస్ స్టేషన్.. ఎక్కడో తెలుసా.?

November 14, 2019

తెలంగాణలోనే తొలిసారిగా చిల్డ్రన్ పోలీస్టేషన్ ఏర్పాటు చేశారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మేడ్చల్ జిల్లాలోని మేడిపల్లిలో దీన్ని బాలల దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఇషాన్ (9) అనే ఒకరోజు కమిషనర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారుల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ఈ పోలీస్ స్టేషన్‌లో వారికి తగ్గట్టుగా  ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించనున్నారు. 

Children Police Station,.

ఈ పోలీస్ స్టేషన్‌లో వేధింపులకు గురైన చిన్నారులు నిర్భయంగా తమ సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా ఇది ఏర్పాటు చేశారు. వీటితో పాటు మైనర్ నేరస్థులు, నేరాలకు పాల్పడే వారి చిన్నారులను దీంట్లో ఉంచనున్నారు. ప్రత్యేకించి చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగా ఏర్పాటు చేశారు. గోడలపై పిల్లలు ఆడుకొనే రంగురంగుల బొమ్మలు చిత్రీకరించారు. దీంట్లో చైల్డ్ ఫ్రెండ్లీ పోలీసులు, జిల్లా న్యాయ సేవాసంస్థ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఇలా రకరకాల  ప్రతినిధులు ఉంటారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది యూనిఫాంలో కాకుండా మఫ్టీలో ఉంటారు. రాష్ట్రంలోనే తొలి చిల్డ్రన్ పోలీస్ స్టేషన్ ప్రారంభించడంపై సీపీ మహేష్ భగవత్ సంతోషం వ్యక్తం చేశారు.