రూ. 73 కోట్లు పలికిన పుస్తకం.. అతనిపై అంత క్రేజ్! - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 73 కోట్లు పలికిన పుస్తకం.. అతనిపై అంత క్రేజ్!

October 15, 2020

ఇంగ్లిష్ పుస్తక పాఠకులకు ప్రముఖ రచయిత, నాటకకర్త విలియం షేక్‌స్పియర్ తెలియదంటే అతియోశక్తి కాదు. ఆయన రాసిన పుస్తకాలు, నాటకాలకు ఇప్పటికీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆయన పుస్తకాల ఆధారంగా ఇప్పటికీ సినిమాలు రూపొందుతున్నాయి. గతంలో ఆయన రాసిన పుస్తకాలు వేలంలో భారీ ధర పలికాయి. తాజాగా షేక్‌స్పియర్ రచించిన మరో పుస్తకం అత్యధిక ధరకు వేలంలో అమ్ముడు పోయింది. 

షేక్‌స్పియర్ 1632లో ”ఫస్ట్ ఫోలియో” పేరుతో రచించిన మొదటి నాటక సంకలనాన్ని బుధవారం న్యూయార్క్‌లోని క్రిస్టీలో వేలం వేశారు. ఆ పుస్తకం ఏకంగా 73 కోట్ల రూపాయల (దాదాపు 10 మిలియన్ డాలర్లు) రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఈ పుస్తకానికి 4 నుంచి 6 మిలియన్ డాలర్లు వస్తాయని వేలం నిర్వాహకులు ఊహించారు. కానీ, వారు ఊహించన ధర కంటే రెండు రెట్లు ఎక్కువ పలికింది. 36 నాటకాలున్న ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ మాస్టర్ పబ్లికేషన్ ముద్రించింది. ఈ పుస్తక ముద్రణకు హెన్రీ కోండెల్, జాన్ హెమింగే అనే ఇద్దరు స్నేహితులు సహకరించినట్లు షేక్‌స్పియర్ తన పుస్తకంలో రాశారు.