కిమ్ రాజ్యంలో కరోనా అడుగు.. రియాక్షన్ చూస్తే షాకే - MicTv.in - Telugu News
mictv telugu

కిమ్ రాజ్యంలో కరోనా అడుగు.. రియాక్షన్ చూస్తే షాకే

May 12, 2022

నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలిస్తున్న ఉత్తరకొరియాలో కరోనా మహమ్మారి రెండేళ్ల తర్వాత తొలిసారి అడుగుపెట్టింది. కరోనా ప్రారంభమైనప్పుడు కిమ్ సరిహద్దులను మూసేయడంతో ఇప్పటివరకు కరోనా వైరస్ ఆ దేశంలో ప్రవేశించలేకపోయింది. అయితే తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ కేసు ఒకటి బయటపడడంతో కిమ్ అప్రమత్తమయ్యారు. వెంటనే అత్యున్నత అధికారులతో సమావేశం నిర్వహించి చర్చల అనంతరం దేశమంతటా లాక్‌డౌన్ విధించారు. ఒక్కకేసుకే భయపడి ‘తీవ్రమైన జాతీయ అత్యవసర సంఘటన’గా ప్రకటించారు. సరిహద్దుల్లో కఠిన ఆంక్షలు విధించారు. పూర్తి స్థాయి ఆంక్షలు విధిస్తేనే కరోనాను అరికట్టగలమని కిమ్ చెప్పినట్టు ఆ దేశ మీడియా పేర్కొంది.